ఆంధ్రప్రదేశ్లోని కడప కేంద్ర కారాగారంలో కరోనా కలకలం రేపుతోంది. ఒకేసారి 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ రావడం వల్ల జైలు అధికారులు అప్రమత్తం అయ్యారు. పాజిటివ్ వచ్చిన ఖైదీలను కొవిడ్ ఆసుపత్రికి తరలించారు.
కడప కేంద్ర కారాగారంలో19 మంది ఖైదీలకు కరోనా - corona virus
ఏపీలోని కడప కేంద్రకారాగారంలో 19 మంది ఖైదీలకు కరోనా సోకింది. బాధితులను కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ఖైదీలు ఆందోళనలో ఉన్నారు. జైలు పరిసర ప్రాంతాలను అధికారులు శానిటైజ్ చేశారు.
కడప కేంద్రకారాగారంలో19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్
జైలు పరిసర ప్రాంతాల్లో రసాయన ద్రావణాన్ని పిచికారీ చేశారు. మొన్నటి వరకు అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉన్నారు. అయినప్పటికీ కరోనా పాజిటివ్ రావడం వల్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన ఖైదీలను అప్రమత్తం చేశారు. ఇటీవల కరోనా ల్యాబ్లో పరీక్షలు నిర్వహించగా 19 మంది ఖైదీలకు పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి:కరోనాతో భాజపా నేత మృతి... నిబంధనలకు లోబడి అంత్యక్రియలు