తెలంగాణ

telangana

ETV Bharat / city

Corona cases : గురుకులంలో 19 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్

ఏపీలోని నెల్లూరు జిల్లా చిట్టేడు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలలో 19 మంది విద్యార్థులు, ఓ అధ్యాపకుడు కొవిడ్‌(Corona cases) బారిన పడ్డారు. వీరందరినీ మెరుగైన చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలలో చేర్పించినట్లు కోట మండల వైద్యాధికారి నాగరాజు తెలిపారు.

19 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్
19 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్

By

Published : Sep 4, 2021, 9:17 AM IST

ఏపీలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఆ రాష్ట్ర విద్యాశాఖ, పాఠశాలల యాజమాన్యాలు ఎంత పకడ్పందీ చర్యలు చేపట్టినా.. విద్యార్థులు, ఉపాధ్యాయులపై కరోనా(Corona cases) పంజా విసురుతోంది. రెండేళ్ల తరువాత తెరుచుకుందని.. ఉత్సాహంతో బడికి వెళ్లిన విద్యార్థులకు మహమ్మారి సోకుతోంది.

నెల్లూరు జిల్లా చిట్టేడు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలలో 19 మంది విద్యార్థులు, ఓ అధ్యాపకుడు కొవిడ్‌(Corona cases) బారిన పడ్డారు. వీరందరినీ మెరుగైన చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలలో చేర్పించినట్లు కోట మండల వైద్యాధికారి నాగరాజు తెలిపారు.

మరోవైపు గ్రామంలోనూ నాలుగు కేసులు నమోదయ్యాయి. ఐటీడీఏ పీవో కనకదుర్గా భవాని, అభివృద్ధి అధికారి రోశిరెడ్డి, తహసీల్దారు పద్మావతి, ఎంపీడీవో భవాని గురుకులాన్ని సందర్శించారు. మిగిలిన విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్‌(Corona cases) నిబంధనలు పాటించాలని ప్రిన్సిపల్‌ విజయలక్ష్మికి సూచించారు. 100 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details