తెలంగాణ

telangana

ETV Bharat / city

గిరిజన యువత ధైర్యం.. కరోనా మృతదేహానికి అంతిమ సంస్కారం - విశాఖ మన్యంలో కరోనా వార్తలు

కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తిని బంధువులు విడిచి వెళ్లిపోగా.. స్థానిక యువత, కొంతమంది బంధువులు ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో జరిగింది ఈ ఘటన

గిరిజన యువత ఆదర్శం.. కరోనా మృతదేహానికి అంతిమ సంస్కారం
గిరిజన యువత ఆదర్శం.. కరోనా మృతదేహానికి అంతిమ సంస్కారం

By

Published : Jul 20, 2020, 8:23 PM IST

కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో.. కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేసేందుకు సాహసించేవారు లేక అనాథ శవాలుగా మారుతున్నాయి. ఇటువంటి తరుణంలో విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ గిరిజన యువకులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏపీలోని విశాఖపట్నంలో ఓ విశ్రాంత ఉద్యోగి గుండెపోటుతో చనిపోయారు. అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని స్వగ్రామమైన ముంచంగిపుట్టు మండలం కిలగాడ తరలించారు.

మృతునికి కరోనా ఉందని తెలియక బంధువులు మృతదేహంపై పడి రోదించారు. అనంతరం కరోనా ఉందని తెలియడంతో కొందరు బంధువులు మృతదేహాన్ని విడిచి వెళ్లిపోయారు. అధికారులు సైతం అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. ఈ క్రమంలో స్థానిక యువత, మృతుని బంధువులు కొంతమంది మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. అనంతరం అందరూ కరోనా పరీక్షలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details