భాగ్యనగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైరతాబాద్‌లోని పీజేఆర్ నగర్లో తాజాగా 8 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో జీహెచ్ఎంసీ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గీతా రాధిక పర్యటించారు.
భాగ్యనగరంలో విస్తరిస్తున్న కరోనా.. అప్రమత్తమైన అధికారులు - hyderabad carona cases latest news
హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. బస్తీల్లోని పలు కుటుంబాలు కరోనా బారిన పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ తరుణంలో ఖైరతాబాద్‌లోని పలు బస్తీల్లో అధికారులు పర్యటించారు. బస్తీల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తూ... ప్రతి ఇంట్లో ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.
భాగ్యనగరంలో విస్తరిస్తున్న కరోనా.. అప్రమత్తమైన అధికారులు
ఆ బస్తీలోని ఇళ్లకు వెళ్లి నర్సులతో పరీక్షలు నిర్వహించారు. వారికి కరోనా గురించి అవగాహన కల్పించామని ఆమె తెలిపారు.
ఇదీ చూడండి :ఆ పేరు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సార్థకమైంది: కేటీఆర్