కరోనా ప్రభావం... రైల్వే ఆదాయంపై గణనీయంగా పడింది. ఆదాయ ఆర్జనలో ఏటా ముందుండే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ డివిజన్... కొవిడ్ దెబ్బతో వెనుకబడింది. గతేడాది మార్చి నుంచి ఏప్రిల్ వరకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2వేల 494 కోట్లు ఆదాయాన్ని మాత్రమే నమోదు చేసింది. వీటిలో సరుకు రవాణా ద్వారా రూ. 2వేల 197.27 కోట్లు ఆదాయం ఆర్జించింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 21 శాతం తక్కువ. లాక్డౌన్ కారణంగా సరుకు రవాణాను తగ్గించడం వల్లే ఆదాయం తగ్గినట్లు విజయవాడ డీఆర్ఎం శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు.
కరోనాతో విజయవాడ రైల్వే డివిజన్లో తగ్గిన ఆదాయం - Corona effect on Vijayawada
ఆదాయ ఆర్జనలో ముందుండే ఏపీలోని విజయవాడ డివిజన్... కొవిడ్ దెబ్బతో వెనుకబడింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 21 శాతం తక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. సరుకు రవాణాను తగ్గించడం వల్లే ఆదాయం తగ్గినట్లు విజయవాడ డీఆర్ఎం శ్రీనివాస్ తెలిపారు.
గతేడాది ప్రయాణికుల రవాణా ద్వారా విజయవాడ డివిజన్ రూ. 219.84 కోట్లు మాత్రమే ఆర్జించింది. డివిజన్ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసినట్లు శ్రీనివాస్ చెప్పారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరించి ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. డివిజన్లో పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలు సహా డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులను పూర్తి చేశామని... మిగిలినవి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీనివాస్ వివరించారు.
ఇదీ చదవండి:ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొవిడ్ చికిత్సకు సర్కారు నిర్ణయం