అల్లాడుతున్న మూగజీవులు
కరోనా మహమ్మారికి ప్రపంచం మొత్తం గజగజలాడుతోంది. లాక్డౌన్తో మనుషులతోపాటు మూగ జీవులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తిరుమలలో భారీ కాయం కలిగిన ఏనుగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎప్పుడూ సగటున పది కిలోమీటర్ల మేర సంచరిస్తూ శ్రీవారి సేవలో తరించే ఏనుగులు గత రెండు వారాలుగా గజశాలలకే పరిమితమయ్యాయి.
శ్రీవారి సేవకు దూరం.. చింతలో గజరాజులు - తితిదే ఏనుగులు తాజా వార్తలు
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై అమలు చేస్తున్న లాక్‌డౌన్ మనుషులు పైనే కాదు.. నోరు లేని మూగ జీవాలపైన ప్రభావం చూపుతోంది. భారీ కాయం కలిగిన గజరాజుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తిరుమలలో ఎప్పుడూ స్వామివారి సేవలో తరించే ఏనుగులు అనారోగ్యం బారిన పడుతున్నాయి. ఈ క్రమంలో తితిదే పశు సంవర్థకశాఖ ఏనుగుల్లో పునరుత్తేజం కలిగించేందుకు అనేక చర్యలు చేపడుతోంది.
శ్రీవారి సేవకు దూరం.. చింతలో గజరాజులు
అనారోగ్య బారిన పడుతున్న గజరాజులు
తితిదే పరిధిలోని గోవిందరాజస్వామి, తిరుచానూరు అమ్మవారి సేవలో పాల్గొనే ఎనిమిది ఏనుగులు శారీరక శ్రమ కొరవడి అనారోగ్య బారిన పడుతున్నాయి. ఈ క్రమంలో ఏనుగుల్లో పునరుత్తేజం కలిగించేందుకు తితిదే పశుసంవర్థకశాఖ చర్యలు చేపట్టింది. సాధారణ రోజుల కంటే అదనపు దాణాతో పాటు... ఇతర మందులను వాడుతూ ఏనుగులను ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చూడండి...