తెలంగాణ

telangana

ETV Bharat / city

కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు! - మిర్చి పంటపై కరోనా ఎఫెక్ట్ న్యూస్

కూలీల కొరతతో రాష్ట్రంలో మిర్చి కోతలు మందగించాయి. కాయ పొలంలోనే ఎండిపోయి రంగు మారుతోంది. కొంతమంది తాలుకాయను చెట్టుకే వదిలేసి ఎర్రకాయ వరకు కోయిస్తున్నారు. ఇంకొందరు పైరు పీకి ఇంటికి తెచ్చి కాయలు కోయిస్తున్నారు. ఇప్పటికే కోసి ఆరబెట్టిన మిర్చినైనా తరలిద్దామంటే ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు యార్డు మూసేశారు. శీతల గోదాములకు తరలిద్దామంటే అక్కడా కూలీల కొరత, పైగా అద్దెలూ పెంచేశారు. ఈ పరిణామలతో మిర్చి సాగు చేసిన రైతులు కుంగిపోతున్నారు. పంటను అమ్మేదెలా అని తలలు పట్టుకుంటున్నారు.

monkey
కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!

By

Published : Apr 9, 2020, 8:28 AM IST

ఈ ఏడాది పత్తితీతలు, మిరప కోతలు ఒకేసారి రావడంతో జనవరి నుంచి కూలీల సమస్య తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే కూలీలతో కొంతమేర కోతలు సాగించారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.450 వరకు చెల్లించారు. ఇలాంటి సమయంలో కరోనా పిడుగు పడింది. దీంతో కోతలు సాగడం లేదు. ఖాళీ గోతాల ధర రూ.50 నుంచి రూ.100కు చేరింది. అవీ కావలసినన్ని దొరకడం లేదు. కోసి ఆరబెట్టిన మిర్చిని శీతల గోదాముకు తీసుకెళ్తే అక్కడా దిగుమతికి సరిపడా కూలీలు లేరు. గోదాము అద్దెలు బస్తాకు రూ.30 నుంచి రూ.70 వరకు పెరిగాయి.

  1. ఈ ఏడాది రాష్ట్రంలో 3.15 లక్షల ఎకరాల్లో మిరప సాగు చేశారు.
  2. ఎకరాకు రూ.1.50లక్షలపైగా రైతులు పెట్టుబడి పెట్టారు.
  3. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలులో అధిక విస్తీర్ణంలో సాగైంది.
  4. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 22 నుంచి పది రోజుల పాటు పొలాలకు వెళ్లనీయలేదు. ఇప్పుడూ 1 గంట వరకే అనుమతిస్తున్నారు.

రశీదుపై రుణమిప్పిస్తే మేలు

కోత, రవాణాకే క్వింటాలుకు రూ.5వేల వరకు ఖర్చవుతోంది. కూలీ చెల్లించాలంటే వారి చేతిలో పైసా లేదు. అమ్ముదామంటే మిర్చి యార్డు మూసేశారు. శీతల గోదాముల రశీదులపై రుణమిప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:కరోనా కాలం.. వేర్వేరు ప్రాంతాల్లో వధూవరులు

ABOUT THE AUTHOR

...view details