పరిశ్రమల మూసివేతకు కారణాలెన్నో:
కూలీలు పనికి రాకపోవడం, ఏదైనా ఇబ్బంది ఎదురైతే తమను బాధ్యులుగా చేస్తారేమోనన్న భయం యజమాన్యాల్లో ఉండటం వల్ల ఆహార శుద్ధి పరిశ్రమలు పనిచేయట్లేదు. కొందరు డ్రైవర్లు వాహనాలు బయటకు తీయకపోవడం, ప్యాకింగ్‌కు అవసరమయ్యే ముడి సామగ్రి లభించకపోవడం టమాటా గుజ్జు తయారీకి ఆటంకాలుగా పరిగణించవచ్చు.
సహాయ కేంద్రాలు సత్వరం స్పందిస్తేనే:
వాహనాలను పోలీసులు ఆపినప్పుడు జిల్లా, రాష్ట్ర స్థాయిలోని సహాయ కేంద్రాలకు ఫోన్ చేసినా.. సరైన స్పందన లేదని యాజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాన్ని నిలిపేశారన్న సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఇవీ చూడండి : నిర్మల్ జిల్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్