కరోనా వేళ రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. శుభ కార్యాలు, భగవంతుని పూజల్లో కళకళ లాడాల్సిన పూలు రహదారి పక్కన చేరి వెలవెలబోతున్నాయి. అమ్మే వారు ఉన్నా కొనే వారు లేక రైతులు తాము తెచ్చిన పూలను పారబోసుకుంటున్నారు. గిరాకీలు లేక నష్టాలను మూటగట్టుకుంటున్నారు.
Corona effect: కరోనా దెబ్బకు... పూల రైతు విలవిల! - corona cases in andhra pradesh
కరోనా ప్రభావంతో పూల రైతులు విలవిల్లాడుతున్నారు. శుభకార్యాలు లేక.. పూలు మార్కెట్ అయ్యే దారిలేక ఇబ్బందులు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడులు రాక, ఉపాధి లేక, పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఏపీలో పూల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ రైతులు దీనంగా వేడుకుంటున్నారు.
![Corona effect: కరోనా దెబ్బకు... పూల రైతు విలవిల! no demand for flowers in ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12078926-666-12078926-1623289524020.jpg)
కరోనాతో తగ్గిన పూల డిమాండ్
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన రైతు వెంకన్న రూ.19వేలు రవాణా ఖర్చు భరించి 4టన్నుల పూలను బుధవారం.. తూర్పుగోదావరి జిల్లా కడియపులంక పూల మార్కెట్‌కు తీసుకొచ్చారు. శుభకార్యాలు లేక పూలకు డిమాండ్ లేదని వ్యాపారులు చెప్పడంతో.. ఉసూరుమంటూ వాటిని రహదారి పక్కన పారబోశారు.
ఇదీ చదవండి:రామగుండం ఫెర్టిలైజర్స్‌కూ న్యూ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ వర్తింపు