కొవిడ్ కారణంగా గిరాకీలు లేక ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా మొదటి దశలో ఏడు నెలలకు పైగా ఆటోలు మూలనపడ్డాయి. తిరిగి రోడ్డెక్కిన తర్వాత ఆటోల్లో వెళ్లేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపలేదు. వైరస్ భయంతో సొంత వాహనాలకు మెుగ్గు చూపారు. కొన్ని నెలల తర్వాత పరిస్థితి మారుతుందన్న తరుణంలో రెండోదశ మళ్లీ దెబ్బకొట్టింది. ఫలితంగా ఉపాధి కరువై... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6లక్షల ఆటో డ్రైవర్లలో సగం మంది నగరాలు, పట్ణణాల నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు. ఇక్కడే ఉన్న కొందరు వచ్చిన డబ్బుతో... జీవనం గడుపుతున్నారు.
కరోనాకు ముందు విద్యాసంస్థలకు 40 శాతం ఆటోలు నడిపేవారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2 లక్షల 25వేల ఆటోలు ఉండగా.... 80వేల వరకు విద్యాసంస్థలకు తిరిగేవి. ప్రస్తుతం విద్యాసంస్థలు, కళాశాలలు మూసివేయటంతో... ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. గిరాకీలు చాలా తక్కువగా ఉంటున్నాయని.... ఇల్లు గడవటం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.