తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా ప్రభావంతో వెలవెలబోతున్న సచివాలయం - Ap no employees at secretariat

ఏపీ సచివాలయంలో నాలుగు రోజుల్లో నలుగురు ఉద్యోగులు కరోనాతో మరణించారు. దీంతో మిగతా సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. చాలా మంది ఉద్యోగులు కార్యాలయానికి రాకపోవటంతో పరిపాలనా భవనం వెలవెలబోతోంది.

corona
కరోనా ప్రభావం

By

Published : Apr 20, 2021, 4:47 PM IST

Updated : Apr 20, 2021, 5:06 PM IST

ఏపీ ప‌రిపాల‌నా భవనంలో క‌రోనా భయం నెలకొంది. నాలుగు రోజుల్లో నలుగురు ఉద్యోగులు కరోనా సోకి మృతి చెందటంతో మిగిలిన వారు ఆందోళన చెందుతున్నారు. స‌చివాల‌యం, అసెంబ్లీ ప‌రిస‌ర‌ ప్రాంతాల్లో సిబ్బంది శానిటైజ్ చేశారు. రోడ్ల వెంట బ్లీచింగ్ చల్లారు. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మహమ్మారి భయంతో ఉద్యోగులు సచివాలయానికి రాలేదు. వచ్చిన వారు కూడా ఆరుబయటే ఉండిపోయారు. దీంతో కార్యాలయం కళ తప్పింది.

ఇప్పటికే 50 మందికి పైగా ఉద్యోగుల‌ు, వారి కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకింది. ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. స‌చివాల‌యంలో ఈ-ఫైలింగ్ విధానం ఉండ‌టంతో ప్రభుత్వ కార్యక‌లాపాల‌కు ఇబ్బంది ఉండ‌ద‌ని ఉద్యోగులు తెలిపారు.

Last Updated : Apr 20, 2021, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details