కరోనాతో మృతిచెందిన మహిళ ఒంటిపై అభరణాలు మాయమైన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది.
ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా మృతురాలి వజ్రాల నగలు మాయం - సెంచరీ ఆస్పత్రిలో నగలు కాజేత

15:08 August 02
ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా మృతురాలి వజ్రాల నగలు మాయం
కరోనా అత్యవసర చికిత్స కోసం గత నెల 23 ఓ మహిళ బంజారాహిల్స్‌లోని సెంచరీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 25 అర్ధరాత్రి మృతిచెందారు. అనంతరం చేతి ఉంగరం, వజ్రాపు చెవి దుద్దులు, ముక్కుపుడక ఇతర ఆభరణాలు మాయమైనట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆస్పత్రి యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మృతురాలి కుమారుడు తెలిపారు. అపహరణకు గురైన ఆభరణాలు విలువ రూ. లక్ష ఉంటుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి:విషాదం మిగిల్చిన కరోనా.. దంపతుల ఆత్మహత్య