కరోనా మహమ్మారితో ఓ వ్యక్తి అంతిమ సంస్కారాలకు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఓ వ్యక్తి అనారోగ్యంతో మరణించగా దహన సంస్కారాలు సాఫీగా చేయలేని పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడు నారాయణస్వామి మృతి చెందాడు. లాక్డౌన్ కారణంగా వైకుంఠం రథం అందుబాటులో లేకపోవటం వల్ల మృతదేహాన్ని ఆటోలో తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
కరోనా కల్లోలం : అంతిమసంస్కారాలకు ఆటంకం
కరోనా మహమ్మారి ప్రతి పనికి అడ్డు తగులుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి తరుణంలో కన్నుమూసిన ఓ వ్యక్తి అంత్యక్రియలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పార్థివదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు వైకుంఠ రథం లేకపోవడం వల్ల ఆటోలో తరలించాల్సి వచ్చింది.
కరోనా కల్లోలం