రాష్ట్రంలో కొత్తగా 269 కరోనా పాజిటివ్ కేసులు - tg corona update
21:12 June 17
రాష్ట్రంలో కొత్తగా 269 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 269 కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఒక్క జీహెచ్‌ఎంసీ నుంచే 214 కేసులు నమోదు కావడం గమనార్హం. మహమ్మారి కారణంగా ఒకరు మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 5,675కి పెరిగింది. మరణాలు సంఖ్య 192కి చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 1,096 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 827 మందికి నెగిటివ్ అని తేలింది. ఇప్పటి వరకు 45,911 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు 3071 మంది డిశ్చార్జి అయ్యారు. బుధవారం ఒక్కరోజే 151 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2412 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.