రాష్ట్రంలో కొత్తగా 862 కరోనా కేసులు, 3 మరణాలు - Telangana covid cases news
08:52 November 26
తెలంగాణలో కొత్తగా 862 కరోనా కేసులు, 3 మరణాలు
తెలంగాణలో కొత్తగా 862 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,66,904 కరోనా కేసులు నమోదు కాగా 1,444 మంది మరణించారు.
కరోనా నుంచి మరో 961 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,54,676 మంది బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 10,784 కరోనా యాక్టివ్ కేసులుండగా.. 8,507 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 164, మేడ్చల్ జిల్లాలో 91, రంగారెడ్డి జిల్లాలో 57 కరోనా కేసులు నమోదయ్యాయి.