రాష్ట్రంలో 14,419కు చేరిన కరోనా కేసులు - కరోనా వార్తలు
21:08 June 28
రాష్ట్రంలో 14,419కు చేరిన కరోనా కేసులు
రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 14,419కు చేరాయి. నేడు నలుగురు మృతి చెందగా... ఇప్పటి వరకు 247 మరణించారు. ఈ రోజు 244 మంది డిశ్చార్జి కాగా... ఇప్పటి వరకు 5,172 మంది వైరస్ నుంచి కోలుకొని ఇంటికెళ్లారు. ప్రస్తుతం 9 వేల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇవాళ అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 816 మంది కరోనా బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 47, మంచిర్యాలో 33, మేడ్చల్ మల్కాజిగిరిలో 29, వరంగల్ గ్రామీణ జిల్లాలో 19, వరంగల్ అర్బన్ జిల్లాలో 12, భద్రాద్రి కొత్తగూడెంలో 5, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో 3 చొప్పున, గద్వాల్, ఆదిలాబాద్ జిల్లాలో 2 చొప్పున, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, జనగామ, మెదక్, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి.