గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 117 మందికి కరోనా సోకినట్లుగా ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఏపీలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,87,466కు చేరగా... కరోనాతో 7,152 మంది మృతి చెందారు. కరోనా నుంచి తాజాగా మరో 128 మంది బాధితులు కోలుకున్నారు.
ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 117 కేసులు - ఏపీలో కరోనా కేసుల సంఖ్య తాజా వార్తలు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 117 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బాధితుల సంఖ్య 8,87,466కి చేరింది.
ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 117 కేసులు
ఇప్పటివరకు 8.78 లక్షల మందికి పైగా బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఏపీలో 24 గంటల వ్యవధిలో 36,189 కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం కొవిడ్ నిర్ధారణ పరీక్షలు కోటీ 30 లక్షలు దాటాయి.