మళ్లీ కరోనా విజృంభణ.. 500లకు చేరువలో కేసులు నమోదు - తెలంగాణ కరోనా కేసులు
19:05 June 23
తెలంగాణలో కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గురువారం 28,865 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 494 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి గురువారం 126 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 3,048 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 315 కేసులు నమోదయ్యాయి. గతవారంతో పోలిస్తే ఇవాళ రెట్టింపు కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ప్రకటించడంతో కొన్ని పాఠశాలల్లో జాగ్రత్తలు పాటిస్తున్నారు. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: