రాష్ట్రంలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు
14:46 June 04
రాష్ట్రంలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3147కు చేరింది. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 110 మందికి కొవిడ్-19 బారిన పడ్డారు. ఆదిలాబాద్లో ఏడు, రంగారెడ్డిలో ఆరు, మేడ్చల్లో రెండు, సంగారెడ్డి, ఖమ్మంలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వైరస్ బారినపడి ఆరుగురు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 105కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1455 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని 1587 మంది డిశ్చార్జ్ అయ్యారు.