తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు - covid 19 cases in telangana

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరువైంది. కొవిడ్​ బారిన పడి ఇప్పటి వరకు 1,693 మంది మృతి చెందారు.

corona
రాష్ట్రంలో 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు

By

Published : Mar 5, 2021, 10:02 AM IST

రాష్ట్రంలో తాజాగా మరో 166 మందికి కరోనా సోకింది. జీహెచ్​ఎంసీ పరిధిలోనే 27 మంది వైరస్​ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 2,99,572కు చేరింది. కొవిడ్​ బారినపడి మరో ఇద్దరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,639కి చేరింది.

మహమ్మారి నుంచి కోలుకొని 149 మంది ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,95,970 మంది కొవిడ్​ కోరల నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 1,963 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 830 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు.

ఇవీచూడండి:కరోనా కాలంలో 'గాంధీ'లో 950 కాన్పులు, 612 సిజేరియన్లు

ABOUT THE AUTHOR

...view details