తెలంగాణ

telangana

ETV Bharat / city

లాక్​డౌన్​ సడలింపుల ఫలితం.. ఏపీలో వైరస్​ ఉద్ధృతం

లాక్​డౌన్​ నిబంధనల సడలింపులతో ఆంధ్రప్రదేశ్​లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల వైరస్​ వ్యాప్తి పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే 294 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కట్టడి ప్రాంతాలు సైతం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.

corona-cases-raised-in-the-state-due-to-lockdown-relaxations
లాక్​డౌన్​ సడలింపుల ఫలితం.. ఏపీ రాష్ట్రంలో వైరస్​ ఉద్ధృతం

By

Published : Jun 15, 2020, 6:45 AM IST

లాక్‌డౌన్‌-5 నిబంధనల సడలింపులతో కరోనా వైరస్‌ దూకుడు పెంచుతోంది. కేసుల రికార్డులు బద్దలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో శనివారం 222 మందికి వైరస్‌ సోకింది. అదే ఎక్కువనుకుంటే.. ఆదివారం 294 కేసులు వచ్చాయి. ఈ క్రమంలో కట్టడి ప్రాంతాలూ అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 622 కట్టడి ప్రాంతాలున్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌-5లో నిబంధనలు సడలించడంతో రాకపోకలు పెరిగాయి. దుకాణల్లో రద్దీ కనిపిస్తోంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంలో నిర్లక్ష్యం ప్రస్ఫుటమవుతోంది. ఫలితంగా కేసులు పెరిగి.. నిన్నటివరకు రద్దీగా ఉన్న ప్రాంతాలు మళ్లీ కట్టడి జాబితాలోకి వెళ్లిపోతున్నాయి. అన్‌లాక్‌-1లో భాగంగా విజయవాడ వన్‌టౌన్‌లో నిబంధనలు సడలించగానే జనం విచ్చలవిడిగా తిరిగారు. పాజిటివ్‌ కేసులు బయట పడటంతో వెంటనే ఆ ప్రాంతం మళ్లీ కట్టడి అయ్యింది. వారంలోనే ఇక్కడ 70కి పైగా కేసులు వచ్చాయి. బాధితుల్లో చిరు వ్యాపారులు, వారి కుటుంబసభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

అన్నీ తెరవడంతోనే..

దేశవ్యాప్తంగా జూన్‌ 1 నుంచి 5వ విడత లాక్‌డౌన్‌ను అన్‌లాక్‌-1.0 పేరుతో నామమాత్రంగా అమలుచేస్తున్నారు. ఈ నెల 8 నుంచి ఆలయాలు, ప్రార్థన మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆతిథ్య సేవలు, షాపింగ్‌ మాళ్లు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య బాగా పెరిగింది. గత 4 రోజులుగా కేసుల సంఖ్య 200 దాటింది. తూర్పుగోదావరి జిల్లా జి.మామిడాడలో ఓ వ్యక్తి నుంచి ఇప్పటికి 175 మందికి పైగా వ్యాపించింది. కర్నూలు జిల్లా ఆదోనిని కట్టడి నుంచి మినహాయించగానే కేసులు బయటపడ్డాయి. దీంతో మళ్లీ ఆ ప్రాంతాన్ని కట్టడిగా ప్రకటించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటదీ అదే పరిస్థితి. రాష్ట్రంలో ఆదివారానికి నమోదైన 6,152 కేసుల్లో 37.5% కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే వచ్చాయి. వీటి తరువాత అనంతపురం, తూర్పుగోదావరి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయి. జూన్‌ 1న రాష్ట్రవ్యాప్తంగా 394 కట్టడి ప్రాంతాలుంటే, శనివారానికి 622కు చేరాయి. ఇటీవలి వరకు విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ కేసులుంటే.. ప్రస్తుతం రాష్ట్రంలోనే కేసులు పెరుగుతున్నాయి. జూన్‌ 1న రాష్ట్రంలో నమోదైన కేసులు 76 ఉండగా ఆదివారం 253 వచ్చాయి.

తేదీలవారీగా కేసులు

తేదీ కేసులు
1 105
2 115
3 180
4 141
5 138
6 210
7 199
8 154
9 216
10 218
11 182
12 207
13 222
14 294

ఇదీ చూడండి :రైతుబంధు సొమ్ము ఎప్పుడిస్తారు? ఎంత మందికిస్తారు?

ABOUT THE AUTHOR

...view details