రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆదివారం 730 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 659 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 7802కు చేరింది. కొవిడ్‌తో ఏడుగురు మరణించారు. మృతుల సంఖ్య 210కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 225 మంది డిశ్చార్జయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 3731 మంది కోలుకున్నారు. ఆస్పత్రుల్లో 3,861 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో కరోనా రికార్డ్.. ఇవాళ 730 పాజిటివ్ కేసులు - తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య
21:19 June 21
రాష్ట్రంలో కరోనా రికార్డ్.. ఇవాళ 730 పాజిటివ్ కేసులు
ఆదివారం 3297 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 57,054 మందికి కరోనా పరీక్షలు పూర్తయ్యాయి.
జిల్లాల్లో..
జనగామ జిల్లాలో కొత్తగా 34 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 10, మేడ్చల్ 9, వరంగల్-6, కుమురం భీం ఆసిఫాబాద్-3, వికారాబాద్ జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. సంగారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మెదక్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయింది.
ఇవీ చూడండి: ఏపీలో కొత్తగా 477 కరోనా పాజిటివ్ కేసులు నమోదు