ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 80,376 మందికి పరీక్షలు నిర్వహించగా.. 1,908 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 19 లక్షల 80 వేల 258కి చేరింది. తాజాగా.. 23 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 13,513కి పెరిగింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,46,370కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,375 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,51,08,146 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
AP CORONA: ఏపీలో కొత్తగా 1,908 కరోనా కేసులు.. 23 మరణాలు - కరోనా కేసుల విజృంభన
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 1,908 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 23 మంది ప్రాణాలు కోల్పోగా... మొత్తం మృతుల సంఖ్య 13, 513కి చేరింది.
కరోనా కేసులు