తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 1,14,105 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 638 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 6,41,791 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరో ముగ్గురు మరణించగా... ఇప్పటివరకు 3,787 మంది మృతిచెందినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 638 కరోనా కేసులు.. 3 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 638 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. కొవిడ్ నుంచి మరో 715 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 9,325 కరోనా యాక్టివ్ కేసులు కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు.
CORONA CASES: రాష్ట్రంలో 638 కొత్త కేసులు.. 3 మరణాలు
రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న మరో 715 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,325 కరోనా యాక్టివ్ కేసులున్నట్టు అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 97.95 శాతం కాగా.. మరణాల రేటు 0.59గా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 59 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది.
ఇదీ చదవండి: కుమారుడికి టీకా కోసం కాలినడకన 6 కిలోమీటర్లు..