Ts CORONA CASES: రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు.. - telangana varthalu
![Ts CORONA CASES: రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు.. CORONA CASES: కొత్తగా 772 కరోనా కేసులు... 7 మరణాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12387189-19-12387189-1625666952571.jpg)
19:25 July 07
CORONA CASES: కొత్తగా 772 కరోనా కేసులు... 7 మరణాలు
రాష్ట్రంలో కరోనా కేసులు మరోసారి వెయ్యికి దిగువన నమోదయ్యాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 1,10,141 పరీక్షలు చేయగా.. 772 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. వీటితో కలిపి మెుత్తం కేసుల సంఖ్య 6,29,054కు పెరిగింది.
వైరస్ బారిన పడి మరో ఏడుగురు మరణించగా.. మృతుల సంఖ్య 3,710కి చేరింది. మరో 748 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 11,472 క్రియాశీల కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇదీ చదవండి: Third wave: భారత్లో మూడోదశ ముప్పు తక్కువే!