Telangana Corona Cases : తెలంగాణలో గత 24 గంటల్లో 50,520 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 614 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,84,062కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం మృతుల సంఖ్య 4,107కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,387 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,908 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Telangana Corona Cases : రోజురోజుకు తగ్గుతున్న కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 614 కేసులు - 24 గంటల్లో కొవిడ్ కేసులు
Telangana Corona Cases : రాష్ట్రంలో కరోనా మూడో దశ ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. రోజురోజుకు కేసులు తగ్గిపోతున్నాయి. కొత్తగా 614 పాజిటివ్ కేసులు నమోదవటమే ఇందుకు నిదర్శనం.

Covid Cases