రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 32,828 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 162 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,66,546కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
TS corona cases: కొత్తగా 162 కరోనా కేసులు.. ఒకరు మృతి - కరోనా కొత్త కేసులు
రాష్ట్రంలో కొత్తగా 162 కరోనా కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. మహమ్మారి నుంచి మరో 247 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,455 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
కొత్తగా 162 కరోనా కేసులు
తాజాగా కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,921కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 247 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,455 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.