తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Corona Cases రాష్ట్రంలో కరోనా పంజా, తాజాగా 507 కేసులు - corona cases in telangana

Telangana Corona Cases తెలంగాణపై కరోనా నెమ్మదిగా తన పంజా విసురుతోంది. రాష్ట్రంలో తాజాగా 507 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 8,30,380కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,997 క్రియాశీల కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33,046 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,70,76,711కు పెరిగింది.

Telangana Corona Cases
Telangana Corona Cases

By

Published : Aug 18, 2022, 7:14 AM IST

Telangana Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 507 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 8,30,380కి పెరిగింది. తాజాగా మరో 605 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 8,23,272 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 17న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,997 క్రియాశీల కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33,046 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,70,76,711కు పెరిగింది.

Telangana Corona Cases Today : తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో కొత్తగా 205, రంగారెడ్డిలో 42, మల్కాజిగిరిలో 41, మేడ్చల్‌ నల్గొండలో 23, కరీంనగర్‌లో 22, ఖమ్మంలో 15, మంచిర్యాలలో 15, మహబూబ్‌నగర్‌లో 12, సంగారెడ్డిలో 11, యాదాద్రి భువనగిరిలో 10 చొప్పున పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 1,15,628 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు.

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో మాత్రం వేగంగా మహమ్మారి వ్యాపిస్తోంది. ముఖ్యంగా దిల్లీపై కరోనా పంజా విసురుతోంది. మహమ్మారి బారిన పడి దాదాపు 60 శాతం మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. భారత్‌లో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం 8 గంటల వరకు 9,062 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 36 మంది మరణించగా.. మరో 15,220 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.57 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.24 శాతానికి తగ్గాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.49 శాతంగా ఉంది.

మొత్తం కేసులు: 4,42,86,256

  • క్రియాశీల కేసులు: 1,05,058
  • మొత్తం మరణాలు:5,27,134
  • కోలుకున్నవారు: 4,36,54,064

భారత్​లో మంగళవారం 25,90,557మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,08,57,15,251కు చేరింది. మరో 3,64,038మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

ప్రపంచ దేశాల్లోనూ కరోనా విలయం కొనసాగుతోంది. కొత్తగా 5,79,794మంది వైరస్​ బారినపడగా.. మరో 1,648 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 596,785,501కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,59,272మంది మరణించారు. ఒక్కరోజే 10,09,443 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 57,07,98,850కు చేరింది.

ABOUT THE AUTHOR

...view details