తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 21,954 కరోనా కేసులు, 72 మరణాలు - ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 21,954 కేసులు నిర్ధరణ కాగా.. 72 మంది మృతి చెందారు.

corona cases in ap
ఏపీలో కొత్తగా 21,954 కరోనా కేసులు, 72 మరణాలు

By

Published : May 6, 2021, 7:55 PM IST

ఏపీలో కొత్తగా 21,954 కరోనా కేసులు, 72 మరణాలు

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,10,147 పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 21,954 కేసులు నిర్ధరణ కాగా.. 72 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,82,329 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

జిల్లాల వారీగా కేసులు

గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,354 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి 3,531 , విశాఖ 2,107 చొప్పున కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా మరణాలు

గత 24 గంటల వ్యవధిలో విశాఖలో అత్యధికంగా 11 మంది మృత్యవాత పడగా.. తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లో 9 మంది మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లాలో 8మంది, ప్రకాశం జిల్లాలో ఆరుగురు మహమ్మారికి బలయ్యారు. చిత్తూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందగా.. నెల్లూరు జిల్లాలో ఇద్దరు చనిపోయారు.

ఇదీ చదవండి: కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details