గడచిన 24 గంటల్లో ఏపీలో 96 మందికి కరోనా సోకింది. అత్యధికంగా చిత్తూరులో 22 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 5, కృష్ణాలో 9, గుంటూరులో 17, తూర్పు గోదావరి జిల్లాలో 7, అనంతపురం 6, నెల్లూరు 9, కడపలో 6, శ్రీకాకుళంలో 4, పశ్చిమగోదావరిలో 4, విజయనగరంలో 4, కర్నూలులో 3 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ ఆ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,681కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 635గా వైద్యాధికారులు తెలిపారు.
ఏపీలో కొత్తగా 96 కరోనా కేసులు.. ఒకరు మృతి - కరోనా కేసుల వార్తలు
ఏపీలో కొత్తగా 96 కరోనా కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,681కు చేరింది. కొవిడ్ నుంచి మరో 71 మంది బాధితులు కోలుకున్నారు.
ఏపీలో కొత్తగా 96 కరోనా కేసులు.. ఒకరు మృతి
71 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,81,877 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల ఒకరు మరణించగా.. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,169 కి చేరింది. 24 గంటల వ్యవధిలో 34,778 కరోనా పరీక్షలు చేయగా... ఇప్పటివరకు 1,38,77,968 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఇదీ చదవండి: కరోనా రూల్స్‌పై కేంద్రం కీలక ప్రకటన