ఏపీలో శుక్రవారం ఒక్కరోజే కేసులు పది వేలు దాటాయి. మొత్తం 61,699 మందికి పరీక్షలు చేయగా 10,376 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,933కు చేరాయి. 20వేల కేసులు దాటిన తొలి జిల్లాగా తూర్పు గోదావరి నిలిచింది. శుక్రవారం ఇక్కడ 1,215 మందికి కరోనా సోకగా మొత్తం కేసులు 20,395కు చేరాయి. మరోవైపు ఒక్క రోజులోనే 68 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,349 మంది చేరింది.
కరోనా కేసుల రోజువారీ వృద్ధి రేటులో ఏపీ టాప్!
కరోనా కేసుల రోజువారీ వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో వైద్యశాఖ అధికారులు ఈ గణాంకాలు వెల్లడించారు.
కరోనా కేసుల రోజువారీ వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో వైద్యశాఖ అధికారులు ఈ గణాంకాలు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరస్ సోకిన వారిలో 28% గ్రామీణ ప్రాంతాల్లో, 72% పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లోని ఏడు రోజుల కేసులను పరిగణనలోకి తీసుకొని రోజువారీ వృద్ధిరేటు లెక్కించగా ఏపీ 9.3 శాతంతో ఉన్నట్లు వెల్లడైంది.
ఇదీ చదవండి:రాష్ట్రంలో వరుసగా మూడోరోజు 10 వేలకు పైగా కరోనా కేసులు