ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82కు పెరిగింది. నిన్న మరో 5 కేసులు నమోదు కాగా... ఆయా బాధితులు ఇప్పటికే కరోనా సోకిన వారి బంధువులేనని అధికారులు తెలిపారు. ఇంకా 280 కరోనా పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ఇవాళ జిల్లా వ్యాప్తంగా మాంసం దుకాణాలు మూసేయాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు. కర్నూలు జిల్లా నంద్యాలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. తొలుత స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అమలు చేయగా... కేసులు 3 నుంచి 19కి పెరిగినందున పట్టణమంతా వర్తింపచేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిత్యవసర సరకులు, కూరగాయలు ఆయా ప్రాంతాలకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటి సర్వే, పురపాలక సంఘం రసాయనాల పిచికారీ కొనసాగించారు. కర్నూలు జిల్లాలో మొత్తం 82 కేసులు రాగా, ఒక్క నంద్యాలలోనే 25 ఉన్నాయి.
కడప జిల్లాలో
కడప జిల్లాలో ఇప్పటివరకూ 30 కేసులు నమోదు కాగా... మరో 401 పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. వృద్ధులు, అత్యవసరమని వైద్యులు సిఫారసు చేసిన వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ.. ఫలితాలను 24 గంటలలోపు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హరికిరణ్ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక రిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా టెస్టింగ్ ల్యాబ్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా పరీక్షల ఫలితాలు వేగంగా అందించేందుకు అవసరమైన సంఖ్యలో ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారా, లేరా అనేది ఆరా తీశారు. సంబంధిత పరికరాల లభ్యత, పనితీరు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో డేటా ఆపరేటర్లు వివరాలు నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు.
చిత్తూరు జిల్లాలో