తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 62 కరోనా కేసులు - ఏపీ కరోనా వైరస్ న్యూస్

ఏపీలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి.. రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 1525కు చేరింది. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో తెలిపిన వివరాలు ప్రకారం.. ఆ రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో 1051 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటి వరకూ 33 మంది మృతి చెందారు. 441 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

corona cases in andrapradhesh
ఏపీలో కొత్తగా 62 కరోనా కేసులు

By

Published : May 2, 2020, 1:12 PM IST

జిల్లాల వారీగా కొత్త కేసులు

  • కర్నూలు జిల్లాలో 25 కరోనా పాజిటివ్‌ కేసులు
  • కృష్ణా జిల్లాలో 12 కేసులు
  • నెల్లూరు జిల్లాలో 6 కేసులు
  • అనంతపురం, కడప, విశాఖ జిల్లాల్లో 4 కేసులు
  • తూర్పుగోదావరి జిల్లాలో 3 కేసులు
  • గుంటూరు జిల్లాలో 2 పాజిటివ్‌ కేసులు
  • ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు
    ఏపీలో కొత్తగా 62 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details