ఏపీలో గడచిన 24 గంటల్లో 30,851 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 993 మందికి వైరస్ సోకింది. కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇప్పటికే కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో.. 480 మంది కోలుకున్నారు.
ఏపీలో మరో 993 మందికి కొవిడ్.. ముగ్గురు మృతి - ఆంధ్రలో తాజా కొవిడ్ కేేసులు
గడచిన 24 గంటల్లో ఏపీలో 993 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. 480 మంది కోలుకోగా.. ముగ్గురు మరణించారు. మొత్తంగా.. 6,614 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొవిడ్, ఏపీ, కొవిడ్, ఆంధ్రప్రదేశ్
మహమ్మారి కారణంగా.. రాష్ట్రంలో మొత్తం 7,213 మంది మృతి చెందారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 6,614 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి:అసైన్మెంట్లు ఇంట్లో రాయండి... మెయిల్ ద్వారా పంపండి: ఇంటర్ బోర్డ్