ఏపీలో కొత్తగా 6,190 కరోనా కేసులు, 35 మరణాలు - corona virus latest news
![ఏపీలో కొత్తగా 6,190 కరోనా కేసులు, 35 మరణాలు corona-cases-in-andhrapradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8985502-1109-8985502-1601388744665.jpg)
18:51 September 29
ఏపీలో కొత్తగా 6,190 కరోనా కేసులు, 35 మరణాలు
కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడం లేదు. కొత్తగా 6,190 కరోనా కేసులు నమోదవ్వగా 35 మంది మృతి చెందారు. మరో 9,836 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,87,351కి చేరింది. ఇప్పటివరకు 5,780 మంది వైరస్‌తో మృతి చెందారు. ప్రస్తుతం 59,435 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి రాష్ట్రంలో మెుత్తం 6,22,136 మంది బాధితులు కోలుకున్నారు. తాజా లెక్కల ప్రకారం.. 6190 మందికి కరోనా సోకింది. 9,836 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడ్డారు.
ఇవీ చూడండి: 'రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది'