ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 1,248 కరోనా కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,715 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 13,677 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 58,890 కరోనా పరీక్షలు చేశారు. కరోనాతో ప్రకాశం, చిత్తూరు జిల్లాలో ముగ్గురు మరణించారు. తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కర్నూల్, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
corona cases: ఏపీలో కొత్తగా 1,248 కరోనా కేసులు, 13 మరణాలు - ఏపీలో కరోనా కేసులు తాజా వార్తలు
ఏపీలో కొత్తగా 1,248 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 13 మంది మరణించారు. ప్రస్తుతం 13,677 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది.
![corona cases: ఏపీలో కొత్తగా 1,248 కరోనా కేసులు, 13 మరణాలు ap corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12867142-401-12867142-1629824235689.jpg)
ap corona cases