తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో తొలిసారి వెయ్యిలోపే కరోనా కేసులు

ఏపీలో తొలిసారి వెయ్యిలోపే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 753 మంది వైరస్ బారినపడ్డారు. 13 మంది మహమ్మారితో మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ap corona cases
ఏపీలో తొలిసారి వెయ్యిలోపే కరోనా కేసులు

By

Published : Nov 16, 2020, 9:45 PM IST

కరోనా ఉద్ధృతి పెరిగాక.. ఏపీలో తొలిసారి వెయ్యిలోపు కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో కేవలం 753 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కేవలం 13 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్​లో మొత్తం వైరస్‌ బాధితుల సంఖ్య 8 లక్షల 54 వేల 764కు పెరిగింది. కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6వేల 881కి చేరింది.

గడచిన 24 గంటల వ్యవధిలో 43 వేల 44 నమూనాలకు పరీక్షలు నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్​ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మరో 15 వందల 7 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8.29 లక్షలకు చేరింది. ప్రస్తుతం 17 వేల 892 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం 91.97 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.

జిల్లాలో కరోనా కేసులు

సోమవారం నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 9, కడప జిల్లాలో 6, పశ్చిమగోదావరి జిల్లా 4, కృష్ణా 3, అనంతపురం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 184 కేసులు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

ఇవీచూడండి:మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​కు కొవాగ్జిన్

ABOUT THE AUTHOR

...view details