తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో రికార్డు స్థాయిలో 2,602 మందికి కరోనా పాజిటివ్ - ఏపీ కరోనా వార్తలు

ఏపీలో 24 గంటల వ్యవధిలో 2602 మందికి కరోనా పాజిటివ్ సోకినట్టు వైద్యారోగ్యశాఖ తెలియచేసింది. ఇందులో ఏపీకి చెందిన 2592 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరు ఉన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

corona-cases-in-andhra-pradesh
ఏపీలో రికార్డు స్థాయిలో 2,602 మందికి కరోనా పాజిటివ్

By

Published : Jul 17, 2020, 4:37 PM IST

ఏపీలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 2602 మందికి కరోనా పాజిటివ్ సోకినట్టు వైద్యారోగ్యశాఖ తెలియచేసింది. ఇందులో ఏపీకి చెందిన 2592 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరు ఉన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యధికంగా తూర్పుగోదావరిలో 643 మందికి కరోనా సోకినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్​లో తెలియచేసింది.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు

గుంటూరుజిల్లా367
చిత్తూరుజిల్లా328
అనంతపురంజిల్లా297
కర్నూలుజిల్లా315
కడపజిల్లా55
కృష్ణా జిల్లా37
నెల్లూరుజిల్లా127
ప్రకాశం జిల్లా53
శ్రీకాకుళం జిల్లా149
విశాఖజిల్లా23
విజయనగరంజిల్లా89
పశ్చిమగోదావరిజిల్లా109

కరోనా కారణంగా గడచిన 24 గంటల వ్యవధిలో 42 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 534కు పెరిగింది.

ఏ జిల్లాలో ఎంతమంది మృతులు

అనంతపురం జిల్లా 6
చిత్తూరుజిల్లా 5
తూర్పుగోదావరిజిల్లా 5
ప్రకాశం జిల్లా 5
గుంటూరుజిల్లా 4
పశ్చిమగోదావరిజిల్లా 4
కడపజిల్లా 3
విశాఖజిల్లా 3
కర్నూలుజిల్లా 2
నెల్లూరుజిల్లా 2
విజయనగరంజిల్లా 2
కృష్ణా జిల్లా 1

ఇక గడచిన 24 గంటల వ్యవధిలో 20, 245 నిర్ధారణా పరీక్షలు చేసినట్టు తెలిపిన ప్రభుత్వం ఇప్పటి వరకూ 12 లక్షల 60 వేల 512 నమూనాలు పరీక్షించినట్టు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 16 వేల 584 మంది కోవిడ్ ఆస్పత్రుల్లో , 3230 మంది కోవిడ్ కేర్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో 837 మంది డిశ్చార్జి అయ్యారు.

ఇదీ చూడండి :ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన కోదండరాం, చాడ

ABOUT THE AUTHOR

...view details