తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 1,322.. 20 వేలు దాటిన కరోనా కేసులు - ఏపీ కరోనా వార్తలు

today's corona cases in Andhrapradesh
ఏపీలో కొత్తగా 1,322 కరోనా పాజిటివ్‌ కేసులు

By

Published : Jul 6, 2020, 4:03 PM IST

Updated : Jul 6, 2020, 5:27 PM IST

16:01 July 06

ఏపీలో కొత్తగా 1,322.. 20 వేలు దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య 20 వేలు దాటింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,322 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా బాధితుల సంఖ్య 20,019కి చేరింది. ఇందులో 17,365 మంది ఏపీకి చెందినవారు. 2,235 మంది ఇతర రాష్ట్రాలవారు. 419 మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారు. ఈ రోజు నమోదైన కేసుల్లో ఏపీకి చెందినవారు 1,263 మందికాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 56 మంది, ఇతర దేశాల నుంచి వచ్చినవారు ముగ్గురు ఉన్నారు.

మరో ఏడుగురు మృతి

గత 24 గంటల్లో ఏపీలో 16,712 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు 10,33,852 శాంపిల్స్‌ పరీక్షించారు. ప్రస్తుతం ఏపీలో 10,860 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 8,920 మంది కోలుకుని డిశ్ఛార్జి అయ్యారు. వీరిలో ఈ రోజు డిశ్ఛార్జి అయినవారు 424 మంది ఉన్నారు. కొవిడ్‌తో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్​లో 239 మంది చనిపోయారు. గత 24 గంటల్లో ఏడుగురు మరణించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనాతో మృతి చెందారు.

జిల్లాల వారీగా...

తాజాగా గుంటూరులో 197, తూర్పుగోదావరి జిల్లాలో 171, అనంతపురంలో 142, కర్నూలులో 136, చిత్తూరులో 120, పశ్చిమగోదావరి జిల్లాలో 106, విశాఖ జిల్లాలో 101, కడప జిల్లాలో 96, కృష్ణా జిల్లాలో 55, నెల్లూరులో 41, ప్రకాశం జిల్లాలో 38 , శ్రీకాకుళంలో 36, విజయనగరంలో 24 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఇవీచూడండి:'ఆగస్టు 15లోపు కరోనా వ్యాక్సిన్ అసాధ్యం'

Last Updated : Jul 6, 2020, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details