ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 69,173 నమూనాలను పరీక్షించగా.. 1,435 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,00,038కి చేరింది. తాజాగా ఆరుగురు కరోనా మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 13,702కి పెరిగింది.
AP Corona: ఏపీలో కొత్తగా 1,435 కేసులు.. 6 మరణాలు - ఏపీలో కరోనా కేసులు తాజా సమాచారం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,435 కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. వైరస్ బారి నుంచి మరో 1,695 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 15,472 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
AP Corona: ఏపీలో కొత్తగా 1,435 కేసులు.. 6 మరణాలు
మరోవైపు 1,695 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జీ కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 15,472 క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,59,72,539 నమూనాలను పరీక్షించినట్లు అందులో పేర్కొంది. తాజాగా చిత్తూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: Kishan Reddy: ఎన్ని లక్షల కోట్లు ఖర్చైనా అందరికి టీకా ఇచ్చి తీరుతాం