తెలంగాణ

telangana

ETV Bharat / city

'కొవిడ్‌ కట్టడిలో తెలంగాణ దేశానికే మార్గనిర్దేశంగా మారింది'

కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు... సత్ఫలితాలిస్తున్నాయని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో 2 వారాలుగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు... రికవరీ రేటు పెరగడం శుభసూచకమని పేర్కొంది. కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు... దేశానికే మార్గనిర్దేశం చేస్తున్నాయని వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు.

corona cases decreasing in telangana said dmho srinivas rao
corona cases decreasing in telangana said dmho srinivas rao

By

Published : May 18, 2021, 10:38 PM IST

'కొవిడ్‌ కట్టడిలో తెలంగాణ దేశానికే మార్గనిర్దేశంగా మారింది'

రాష్ట్రంలో కరోనా తీవ్రత... తగ్గుముఖం పట్టిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 2 వారాలుగా కొవిడ్‌ కేసులు తక్కువగా నమోదవుతున్నాయని వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గిందని... ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. గ్రామాల్లోనూ కొవిడ్‌ నియంత్రణలో ఉందని... ఇంటింటి సర్వే ద్వారా... కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మందులు అందిస్తున్నామని వివరించారు. కొవిడ్‌ రెండో దశలో రాష్ట్రంలో 2 లక్షల 37వేల కేసులు నమోదు కాగా... ఇప్పటికే లక్షా 90వేల మందికిపైగా కోలుకున్నారని తెలిపారు. కేవలం 20శాతం మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 90.48 శాతంగా ఉందని తెలిపారు. టీకాల కొరత వల్ల వ్యాక్సినేషన్‌ ఆపాల్సి వస్తోందన్న డీహెచ్​.. వ్యాక్సినేషన్ మళ్లీ ప్రారంభమయ్యే తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.

తక్కువ మందికే బ్లాక్​ఫంగస్​...

రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ తీవ్రత అంతగా లేదని... హైరానా పడాల్సిన అవసరం లేదని వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు గాంధీ, ఈఎన్టీ ఆస్పత్రుల్లో కేవలం 50 రోగులు మాత్రమే చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 30 మంది చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోందన్నారు. మరో రెండు మూడు రోజుల్లో బ్లాక్‌ ఫంగస్‌కు మందులు అందుబాటులోకి వస్తాయన్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక చాలా తక్కువ మందికి మాత్రమే బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మధుమేహం ఉన్నవాళ్లు షుగర్‌ లెవెల్స్‌ చెక్‌ చేసుకోవాలని తెలిపారు. షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటే రోగనిరోధకశక్తి మెరుగ్గా ఉండి ఫంగస్‌ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు.

రాష్ట్రంలో కొవిడ్‌తోపాటు బ్లాగ్‌ ఫంగస్‌ బాధితులకు వైద్యం అందిచడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 'కేసులు తగ్గినా.. మిగతా 98 శాతం మందికీ ముప్పే!'

ABOUT THE AUTHOR

...view details