తెలంగాణ

telangana

ETV Bharat / city

Ap Corona: ఏపీలో కొత్తగా 1,367 కరోనా కేసులు, 14 మరణాలు - andhrapradhesh corona news

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 1,367 కరోనా కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 61,178 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

Corona
ఏపీ

By

Published : Sep 16, 2021, 7:11 PM IST

గడిచిన 24 గంటల్లో ఏపీలో 61,178 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,367 కరోనా కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. వైరస్ నుంచి మరో 1,248 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 14,708 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.

జిల్లాల వారీగా మృతులు, కేసులు..

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరిలో ఇద్దరు చొప్పున, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. అనంతపురంలో 20, చిత్తూరులో 217, తూర్పుగోదావరిలో 288, గుంటూరులో 101, కడపలో 108, కృష్ణాలో 155, కర్నూలులో 3, నెల్లూరులో 135, ప్రకాశంలో 141, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 55, విజయనగరంలో 8, పశ్చిమగోదావరిలో 126 కేసులు నమోదయ్యాయి.

హెల్త్ బులిటెన్

ఇదీ చూడండి:Covid Endemic: భారత్‌లో కరోనా.. 6 నెలల్లో ఎండెమిక్‌ దశలోకి..?

ABOUT THE AUTHOR

...view details