తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​పై పంజా విసురుతున్న కరోనా - corona cases in ghmc

హైదరాబాద్‌ మహానగరి(జీహెచ్‌ఎంసీ)పై కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. 14 రోజుల వ్యవధిలోనే ఇక్కడ 500 పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం రాష్ట్రంలో 62 కరోనా పాజిటివ్‌ కేసులను నిర్ధారించగా, ఇందులో 42 జీహెచ్‌ఎంసీ పరిధిలోవే కావడం గమనార్హం.

GHMC
హైదరాబాద్​పై పంజా విసురుతున్న కరోనా

By

Published : May 23, 2020, 5:18 AM IST

Updated : May 23, 2020, 7:28 AM IST

హైదరాబాద్ మహానగరిలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో శుక్రవారం 62 కరోనా కేసులు నమోదవ్వగా అందులో 42 జీహెచ్​ఎంసీ పరిధిలోవే కావడం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఒకటి, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వలసజీవుల్లో మరో 19 కేసులను నిర్ధారించారు. ఫలితంగా వలసజీవుల్లో కొవిడ్‌ కేసుల సంఖ్య 118కి పెరిగింది.

మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసులు 1761కు చేరాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 670 మంది చికిత్స పొందుతుండగా, శుక్రవారం మరో ఏడుగురు డిశ్ఛార్జి అయ్యారు. ఈ క్రమంలో ఆరోగ్యవంతులుగా ఇళ్లకెళ్లినవారి సంఖ్య 1043కు చేరుకుంది. మహమ్మారి బారినపడి మరో ముగ్గురు మృతిచెందగా, ఇప్పటి వరకూ కరోనా కాటుతో కన్నుమూసినవారి సంఖ్య 48కు పెరిగింది.

ఇన్‌స్పెక్టర్‌, ఎస్సై, కానిస్టేబుల్‌కు కరోనా

నగరంలోఓ ఠాణాలో విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్‌కు కరోనా సోకింది. మూడురోజులుగా అనారోగ్యంగా ఉన్న ఆయనకు కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఇన్‌స్పెక్టర్‌ వలస కార్మికులను స్వస్థలాలకు పంపించడంలో చురుకుగా వ్యవహరిస్తూ వచ్చారు. అధికంగా బిహార్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన కార్మికులతో మాట్లాడి.. వారిని స్వస్థలాలకు పంపించే పనిలో నిమగ్నమయ్యారు. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లోనూ ఆయన విధులు నిర్వహించారు.

అదే ఠాణాలో పనిచేస్తున్న నలుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు మొత్తం 30 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. కొందరిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. వేరే ఠాణాలో ఒక ఎస్సైకి, మరో పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌కు కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఎస్సై గాంధీ ఆసుపత్రిలో బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. కానిస్టేబుల్‌ గాంధీ ఆసుపత్రిలోని క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌(క్యూఆర్‌టీ)లో వారం క్రితం వరకు విధులు నిర్వర్తించారు.

Last Updated : May 23, 2020, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details