తెలంగాణలో మరో 176 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,98,807 మందికి మహమ్మారి సోకగా ఇప్పటివరకు 1634 మంది మరణించారు.
రాష్ట్రంలో 176 కరోనా కేసులు, ఒకరు మృతి - covid deaths in telangana
తెలంగాణలో కరోనా రెండో దశ ముప్పు పొంచి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో తాజా మరో 176 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఒకరు మృతి చెందారు.
తెలంగాణలో కరోనా కేసులు
కరోనా నుంచి మరో 163 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి నుంచి బయటపడిన వారి సంఖ్య 2,95,222కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,951 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 859 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా మరో 27 కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి :దేశంలో మరో 16,752 మందికి కరోనా