మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నందున.. తెలంగాణకూ రెండో దశ కొవిడ్ ముప్పు పొంచే ప్రమాదం కనిపిస్తోంది. రాష్ట్రంలో మరో 178 కరోనా కేసులు నమోదవ్వగా.. వైరస్ బారిన పడి తాజాగా ఒకరు మృతి చెందారు.
రాష్ట్రంలో 178 కరోనా కేసులు, ఒకరు మృతి
రాష్ట్రంలో మరో 178 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందినట్లు పేర్కొంది. తెలంగాణకు రెండో దశ కరోనా ముప్పు పొంచి ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది.
తెలంగాణ : 178 కరోనా కేసులు, ఒకరు మృతి
తెలంగాణలో ఇప్పటివరకు 2,98,631 నమోదవ్వగా.. మహమ్మారి సోకి ఇప్పటివరకు 1,633 మంది మరణించారు. వైరస్ నుంచి మరో 148 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి నుంచి బయటపడిన బాధితుల సంఖ్య 2,95,059కి చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,939 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 850 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 33 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి :రెండో విడత: రోజూ 1.20 లక్షల మందికి టీకా...