తెలంగాణలో కొత్తగా 993 కరోనా కేసులు, 4 మరణాలు - today telangana corona cases
08:34 November 25
రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు, 4 మరణాలు
తెలంగాణలో కొత్తగా 993 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి నలుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,66,042 కొవిడ్ కేసులు నమోదవ్వగా.. 1,441 మంది మహమ్మారి సోకి మరణించారు.
కరోనా నుంచి మరో 1,150 మంది బాధితులు కోరుకున్నారు. వీరితో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,53,715కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,886 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 8,594 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 161, మేడ్చల్ జిల్లాలో 93, రంగారెడ్డి జిల్లాలో 62 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి : 'అందరికీ వ్యాక్సిన్ అవసరం లేదు'