తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో 41 వేలు దాటిన కరోనా కేసులు.. 396 మంది మృతి - telangana covid news

రాష్ట్రంపై కొవిడ్‌ పంజా విసురుతూనే ఉంది. కొత్తగా 1676 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. 10 మంది మృతి చెందారు. 1296 మంది వైరస్‌ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. జీహెచ్​ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినా... జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి క్రమంగా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 41 వేలు దాటింది.

telangana corona
రాష్ట్రంలో 41 వేలు దాటిన కరోనా కేసులు.. 396 మంది మృతి

By

Published : Jul 17, 2020, 4:46 AM IST

కొవిడ్‌ కలకలం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జిల్లాల్లోనూ కేసుల సంఖ్య అదుపులోకి వచ్చేలా లేదు. తాజాగా రాష్ట్రంలో 1676 మందికి కొవిడ్‌ సోకగా... అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 788 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య.. 41 వేల మార్క్ దాటింది. తాజాగా వచ్చిన పాజిటివ్‌ కేసులతో కలిపి ఇప్పటి వరకు 41,018 మంది కరోనా బారిన పడ్డారు. గురువారం 1,296 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 27,295 మంది వైరస్‌ బారి నుంచి బయటపడ్డారు. తాజాగా 10 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకు 396 మంది మహమ్మారికి బలయ్యారు.

ఇక జిల్లాల్లో రంగారెడ్డి 224, మేడ్చల్ 160, కరీంనగర్ 92, నల్గొండ 64, సంగారెడ్డి 57, వనపర్తి 51, వరంగల్ అర్బన్ 47, నాగర్ కర్నూల్ 30, నిజామాబాద్, సూర్యాపేటలో 20 కేసుల చొప్పున నమోదయ్యాయి.

ఇవీచూడండి: 'ఫార్మా, బయోటెక్ రంగాల్లో తిరుగులేని శక్తిగా హైదరాబాద్'

ABOUT THE AUTHOR

...view details