ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 93,785 పరీక్షలు నిర్వహించగా.. 2,526 కేసులు నమోదయ్యాయి. కొత్త వాటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,32,105 మంది వైరస్ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 24 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 13,081కి చేరింది.
Ap Corona Cases: ఏపీలో కొత్తగా 2,526 కేసులు.. 24 మరణాలు - ఆంధ్రప్రదేశ్‌లో కరోనా యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 2,526 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,32,105 మంది వైరస్ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 2,526 కేసులు
గడిచిన 24 గంటల వ్యవధిలో 2,933 మంది బాధితులు కోలుకోవడంతో.. మొత్తం సంఖ్య 18,93,498 కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 25,526 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,33,14,697 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో 404, చిత్తూరు జిల్లాలో 391, ప్రకాశం జిల్లాలో 308, కృష్ణా జిల్లాలో 269 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: