తెలంగాణ

telangana

ETV Bharat / city

కొవిడ్-19 దృష్ట్యా... కరచాలనం కంటే వందనమే మేలు! - CORONA AWARENESS CAMP

కొవిడ్ 19 వైరస్​పై సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వైరస్ బారిన పడినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని... రోగనిరోధక శక్తి ఉంటే త్వరగానే తగ్గిపోతుందని స్పష్టం చేశారు.

రోగనిరోధక శక్తి ఉంటే చాలు త్వరగానే తగ్గిపోతుంది : వైద్యుడు
రోగనిరోధక శక్తి ఉంటే చాలు త్వరగానే తగ్గిపోతుంది : వైద్యుడు

By

Published : Mar 3, 2020, 11:13 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కరోనా వైరస్​పై విద్యార్థులకు వైద్యుడు రాజ్ కుమార్ అవగాహన కల్పించారు. వైరస్​పై భయపడాల్సిన పని లేదని ఆయన అన్నారు. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని పటాన్ చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన శిబిరంలో పేర్కొన్నారు.

రోగనిరోధకత పెంచుకుంటే చాలు

కరచాలనానికి బదులు వందనం చేయాలని తెలిపారు. కొద్ది రోజులుగా జలుబు, జ్వరం, శ్వాస పీల్చుకో లేని స్థితి లాంటివి కలిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. కొవిడ్-19 వైరస్ సోకినా భయపడాల్సిన అవసరం లేదని... రోగనిరోధక శక్తి ఉన్న వారికి తొందరగానే తగ్గిపోతుందని స్పష్టం చేశారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి నయమవడానికి కాస్త ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. ఈ వైరస్​పై విద్యార్థులు... ఇతరులకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

రోగనిరోధక శక్తి ఉంటే చాలు త్వరగానే తగ్గిపోతుంది : వైద్యుడు

ఇవీ చూడండి : మోదీ అందుకే వైదొలుగుతున్నారు: నారాయణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details