తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో ఒక్కరోజే ఎనిమిది కరోనా పాజిటివ్​ కేసులు - Covid-19 latest updates

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 13కు చేరాయి. నిన్న ఒక్కరోజే ఎనిమిది కొవిడ్​-19 పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో ఒక్కరూ తెలంగాణకు చెందిన వారు కాకపోవటం గమనార్హం.

Corona Alarming In State
ఒక్కరోజే ఎనిమిది కరోనా పాజిటివ్​ కేసులు

By

Published : Mar 19, 2020, 5:25 AM IST

Updated : Mar 19, 2020, 10:06 AM IST

రాష్ట్రంలో ఒక్కరోజే ఎనిమిది కరోనా పాజిటివ్​ కేసులు

కరోనా కలకలం రోజు రోజుకీ పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 13కి చేరాయి. బుధవారం ఒక్కరోజే ఎనిమిది కొవిడ్​-19 పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఇండోనేషియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి నిన్న కరోనా పాజిటివ్ రాగా.. అతనితో పాటు వచ్చిన తొమ్మిది మందిలో ఏడుగురికి కరోనా నిర్ధారణ అయినట్టు వైద్యులు ప్రకటించారు. వారు పర్యటించిన ప్రదేశాలు సహా... ఎవరెవర్ని కలిశారన్న విషయాలపై వైద్య ఆరోగ్య శాఖ ఆరా తీస్తోంది.

ఇండోనేషియా నుంచి..

స్కాట్​లాండ్ నుంచి వచ్చిన 22 ఏళ్ల యువకుడికి నిన్న కరోనా పాజిటివ్ రాగా... మరో ఏడుగురికి కూడా కరోనా నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీరంతా ఈనెల 14న ఇండోనేషియా నుంచి కరీంనగర్​కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇండోనేషియా నుంచి దిల్లీకి విమానం ద్వారా.. అక్కడి నుంచి హైదరాబాద్​కి రైలులో వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. వీరంతా కరీంనగర్ సమీపంలో ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం.

ఒకరి నుంచి ఏడుగురికి..

అనంతరం బృందంలోని ఒకరికి కరోనా లక్షణాలు కనిపించగా.. స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు గాంధీకి పంపించారు. 50 ఏళ్లకుపైగా ఉన్న ఆ వ్యక్తికి ఈ నెల 16న కరోనా ఉన్నట్లు నిర్ధారించిన వైద్యులు... గాంధీలోనే చికిత్స అందిస్తున్నారు. అతనితోపాటు ఉన్న మిగతావారిని ఐసోలేషన్​లో ఉంచి పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురికి వైరస్​ సోకినట్లు తెలింది.

అత్యవసర సమావేశం..

వరుస పాజిటివ్ కేసులతో అప్రమత్తమైన సర్కారు... తక్షణ చర్యలకు ఉపక్రమించింది. అర్ధరాత్రి వరకు మంత్రి ఈటల... కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్​లో.. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు.. భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజలను మరింత అప్రమత్తం చేయడమే కాకుండా.. సమూహాలను కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

నేడు సీఎం అత్యున్నత స్థాయి సమావేశం..

కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ, వివిధ శాఖలు తీసుకుంటున్న చర్యలు... భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:షాకింగ్ న్యూస్​: మరో 276 మంది భారతీయులకు కరోనా

Last Updated : Mar 19, 2020, 10:06 AM IST

ABOUT THE AUTHOR

...view details